News October 13, 2025
కోరుట్ల: వాహనం ఢీ కొని వ్యక్తి దుర్మరణం

కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోరుట్లకి చెందిన మారుపాక వినోద్ (28) అక్కడిక్కడే మృతిచెందాడు. వినోద్ పై నుంచి వాహనం వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలోనే కారు, బైక్ ఢీకొని ఒకరు చనిపోగా 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరిగింది.
Similar News
News October 14, 2025
OBC ఆదాయ పరిమితి పెంచమన్న కేంద్రం

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువుంటే ప్రభుత్వ విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు రావు. ఆఖరిసారి 2017లో రూ.6 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.8 లక్షలకు పెంచింది. ఇప్పటికే 2020, 2023లో పెంపు గడువు ముగిసింది. ఈ లిమిట్ పెంచితే పేద OBC వర్గాలకు రిజర్వేషన్లలో పోటీ కష్టమవుతుందనే కేంద్రం అంగీకరించట్లేదని తెలుస్తోంది.
News October 14, 2025
MHBD: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: రజిత

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఉపాధి అధికారి రజిత అన్నారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మహబూబాబాద్‌లోని శ్రీనివాస నర్సరీ, మారుతీ ఆగ్రోటేక్ ఖాళీగానున్న ఫీల్డ్ అడ్వైజరీ, గ్రూప్ లీడర్స్ పోస్టుల భర్తీకి ఈనెల 15న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18-35 వయసు కలిగిన వారు అర్హులని తెలిపారు.
News October 14, 2025
నిర్మల్ : పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేస్తాం: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో పోలీస్ సేవలను మరింత చేరువ చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉండి, వినతులను స్వీకరించాలని ఆమె సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.