News October 14, 2025

బాణసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి: SP నరసింహ

image

దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా (పటాకులు) విక్రయానికి సంబంధించిన దుకాణాలు పెట్టేందుకు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ నరసింహా తెలిపారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే క్రాకర్స్ విక్రయం జరపాలన్నారు. బాణసంచా తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 14, 2025

బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

image

అక్టోబర్‌లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.

News October 14, 2025

సత్యం వైపు మార్గం చూపేదే ‘వేదం’

image

భగవంతుడు సత్య స్వరూపుడు. శాశ్వతుడు. కానీ ఈ జగత్తు అశాశ్వతం. సత్యమైన దేవుడే ఈ మిథ్యా లోకాన్ని సృష్టించాడు. ఈ అశాశ్వతమైన జీవులందరికీ ముక్తి ప్రసాదించి, తనలో శాశ్వతంగా ఐక్యం చేసుకోవడమే భగవంతుడి అంతిమ లక్ష్యం. జీవులు తిరిగి సత్యం వైపు పయనించడానికి, శాశ్వత స్థితిని పొందడానికి అవసరమైన దేవ మార్గాన్ని(మోక్ష మార్గాన్ని) స్పష్టంగా తెలియజేసేదే వేదం. అందుకే వేదమే సృష్టి ప్రయోజనాన్ని వివరిస్తుంది. <<-se>>#VedikVibes<<>>

News October 14, 2025

‘ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపుల విక్రయాలు అరికట్టండి’

image

ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమై కలెక్టర్ చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలన్నారు.