News October 14, 2025

నిర్మల్ : పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేస్తాం: ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో పోలీస్ సేవలను మరింత చేరువ చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉండి, వినతులను స్వీకరించాలని ఆమె సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

Similar News

News October 14, 2025

వికారాబాద్ డీసీసీ పీఠం ఎవరికి.?

image

వికారాబాద్ జిల్లాలో DCC పీఠం ఎవరికి దక్కుతుందో కాంగ్రెస్, నాయకులు వేచి చూస్తున్నారు. పట్లోల రఘువీరారెడ్డి, అర్ధ సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. వాళ్లు తమ స్టైల్‌లో కైవసం చేసుకోవడానికి పైరవీలు భారీగా చేస్తున్నారు. జిల్లాలో ప్రతిపక్షంలో ఉంటూ పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన రఘువీరారెడ్డిని పార్టీ గుర్తించడం లేదంటూ నాయకులు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

News October 14, 2025

జనగామ: వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి

image

స్టేషన్‌ఘనపూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో సోమవారం వేటగాళ్ల ఉచ్చులో పడి జింక మృతి చెందింది. గ్రామస్తులు ఈ విషయాన్ని సంబంధిత అటవీ అధికారులకు తెలిపారు. తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ, పోలీసు శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

News October 14, 2025

ADB: బెస్ట్‌గా నిలవాలంటే.. బకాయిలు ఇవ్వాల్సిందే

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బెస్ట్‌ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేసి, ఆ స్కూల్స్ యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్యాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో పిల్లలను బడుల్లోకి రానీయడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 15+ స్కూల్స్‌లో విద్యార్థులు చదువుకుంటున్నారు. బకాయిలు ఇవ్వాలని కోరుతున్నారు.