News October 14, 2025
HNK: కటాక్షాపూర్ కాజ్‌వే నిర్మాణానికి రూ. 15లక్షల మంజూరు: కలెక్టర్

వరంగల్ -ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్‌వే నిర్మాణాన్ని రూ.15లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కటాక్షపూర్ కాజ్‌వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఈ కిరణ్ పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
తగ్గిన డిమాండ్.. పతనమవుతున్న ధరలు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు. సాధారణంగా దీపావళికి డిమాండ్ ఉంటుందని, ఈ దఫా అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ధర కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుందన్నారు. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.
News October 14, 2025
HYD: సరిపడా ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థుల అవస్థలు

సమయానికి గమ్యం చేరుకోవాలని ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా యువకులు ప్రయాణం చేస్తున్నా దృశ్యాలు హయత్‌నగర్‌లో కనిపించాయి. అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో కాలేజీ విద్యార్థులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నిత్యం ఇదే పరిస్థితి ఉందని, సంబంధిత అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
News October 14, 2025
ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్‌లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్‌చెరులో 20గుంటలు, షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్‌ను జప్తు చేయనున్నారు.