News October 14, 2025
విదేశీ విద్యపై విప్లవాత్మక నిర్ణయం

TG: విదేశీ విద్యా పథకంలో BC, SC, ST విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తూ CM రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో బీసీ విద్యార్థుల్లో లబ్ధిదారుల సంఖ్య 300కాగా ఇప్పుడు అది 700కు చేరనుంది. BC-C, Eలతో కలుపుకుంటే విద్యార్థుల సంఖ్య 1000కి చేరుతుంది. SC విద్యార్థుల సంఖ్య గతంలో 210 ఉండేది. అది ఇప్పుడు 500కు చేరనుంది. ST స్టూడెంట్స్‌లో లబ్ధిదారులు 100మంది మాత్రమే ఉండేవారు. వాళ్లిప్పుడు 200కు చేరనున్నారు.
Similar News
News October 14, 2025
ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్‌లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్‌చెరులో 20గుంటలు, షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్‌ను జప్తు చేయనున్నారు.
News October 14, 2025
పోలీస్ శాఖను మూసేయడం బెటర్: హైకోర్టు అసంతృప్తి

ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్‌లో రాజీ రికార్డుల సీజ్‌కు HC SEP 19న ఆదేశాలిచ్చింది. CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.
News October 14, 2025
జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

తెల్లజుట్టును దాయడానికో, ఫ్యాషన్ కోసమో జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి. <<-se>>#haircare<<>>