News October 14, 2025

సిర్పూర్ టీ: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

మద్యానికి బానిసై పురుగు మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ వివరాలు.. మండలంలోని మాకిడి గ్రామానికి చెందిన తంగే బాలాజీ మద్యానికి బానిసై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

విజయనగరం: విధుల్లోకి చేరిన నూతన ఉపాధ్యాయులు

image

డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు విధుల్లో చేరడంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఈ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్మెంట్లో 578 మంది కొత్త ఉపాధ్యాయలు పోస్టింగ్ పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. వీరంతా సోమవారం విధులకు హాజరయ్యారు.

News October 14, 2025

ములుగు డీసీసీపై ‘రెడ్డి’ కన్ను..?!

image

ములుగు డీసీసీ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి రాంరెడ్డి ప్రయత్నం తీవ్రతరం చేశారు. మార్కెట్ కమిటీ, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవులు ఎస్టీలకు కేటాయించడంతో మిగతా సామాజిక వర్గాల నేతలు తమ భవిష్యత్‌పై ఆందోళనలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్‌గా పైడాకుల అశోక్ రెండు పర్యాయలు పనిచేయగా.. ఈసారి మల్లాడికే అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

News October 14, 2025

హనుమకొండ: కార్పొరేటర్ ఇంట్లో పేకాట.. 12 మంది అరెస్ట్

image

హనుమకొండ సుబేదారి కనకదుర్గ కాలనీలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో సహా 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.