News October 14, 2025
రాజోలు: అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయమేనా..?

రాజోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యను టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించడం చర్చనీయాంశమైంది. గొల్లపల్లి అభిమానులను టీడీపీ వైపు తిప్పుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్లు వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మరోవైపు తనయుడు శ్రీధర్‌కు కోఆర్డినేటర్ ఇవ్వాలని గొల్లపల్లి జగన్‌ను కోరడంతో.. రాజోలు బరిలో అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయంగా కనిపిస్తోంది.
Similar News
News October 14, 2025
కొనుగోళ్లలో పత్తి రైతుకు దక్కని మద్దతు

AP: కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో పత్తికి గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు పొడవు పింజ రూ.8,110, పొట్టి పింజ రూ.7,710గా నిర్ణయించారు. అయితే సోమవారం 16 వేల క్వింటాళ్ల మేర పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.7,419, కనిష్ఠంగా రూ.3,966కే కొన్నారు. మెజార్టీ పత్తిని క్వింటాకు రూ.5,500-రూ.5000 మధ్యే కొంటున్నారని రైతులు చెబుతున్నారు.
News October 14, 2025
సంగారెడ్డి: సులభమైన పద్ధతిలో బోధన చేయాలి: ఎంఈఓ

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో డిజిటల్ లెర్నింగ్ విద్యపై నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి విద్యాసాగర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు బోధన చేస్తే సులభంగా అర్థం చేసుకుంటారని అన్నారు. వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, ఆర్పీలు పాల్గొన్నారు.
News October 14, 2025
HYD: తెలుగు వర్శిటీ.. ఫిలిం డైరెక్షన్ దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీ నాంపల్లి ప్రాంగణంలో “పీజీ డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్” కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణతలైన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వర్శిటీ రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.రాజు 9346461733కు సంప్రదించాలన్నారు.