News October 14, 2025
జూబ్లీహిల్స్‌లో 1,500 నామినేషన్లు వేసేందుకు READY

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగలనుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెసోళ్లు నిత్యం KCRను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా 1,000 మంది నిరుద్యోగులు, 300 మంది మాలలు, 200 మంది RRR రైతులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓటమి సురుకు తగిలితేనే పని చేస్తుందని, లేదంటే ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తుందని వారు పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
HYD: కొత్త మద్యం పాలసీపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కొత్త మద్యం పాలసీపై సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టు జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటే దరఖాస్తు చేయొద్దని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పారు. తదుపరి విచారణ వచ్చే నెల 3కు వాయిదా వేశారు.
News October 14, 2025
HYD: తెలుగు వర్శిటీ.. ఫిలిం డైరెక్షన్ దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీ నాంపల్లి ప్రాంగణంలో “పీజీ డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్” కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణతలైన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వర్శిటీ రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.రాజు 9346461733కు సంప్రదించాలన్నారు.
News October 14, 2025
BREAKING: HYD: మాగంటి సునీత, కూతురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మసీదు వద్ద ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శుక్రవారం యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలోని మసీదు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేయాలని ప్రభావితం చేశారని పేర్కొన్నారు. సునీతను A1, అక్షరను A2గా, మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.