News October 14, 2025
NABARDలో ఉద్యోగాలు

నాబార్డ్ 6 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ( BCA, IT), ME, M.TECH, MCA, MBA, CA, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. వెబ్‌సైట్: https://www.nabard.org/
Similar News
News February 21, 2026
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సీనియర్ ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారనే పక్కా సమాచారంతోనే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
News February 21, 2026
రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 21, 2026
T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్‌లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్‌లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.


