News October 14, 2025
నిర్మల్: మళ్లీ ఆయనకే ‘హస్తం’ పగ్గాలు..?

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి పదవికి సంబంధించి పీసీసీ పరిశీలకుల పర్యటన జిల్లాలో కొనసాగుతోంది. అయితే ఈ పదవిని మళ్లీ కూచాడి శ్రీహరి రావుకి కేటాయిస్తారని అంతటా చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలోకి రాక ముందు నుంచి చురుకుగా కార్యక్రమాలు నిర్వహించారని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారని మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే ఈ పదవికి ఆనంద్ రావు పటేల్, ఎంబడి రాజేశ్వర్ తదితరులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 14, 2025
మంత్రి సీతక్క చొరవ.. జంపన్న వాగు వద్ద మళ్లీ బోటు

ఏటూరునాగారం మండలం దొడ్ల జంపన్న వాగు వద్ద రవాణా సౌకర్యం పునరుద్ధరించారు. నిన్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో, మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి వెళ్లగా ఆమె తక్షణమే స్పందించి, తాత్కాలికంగా తొలగించిన బోటును మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈరోజు బోటు ఏర్పాటు కావడంతో రవాణా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
News October 14, 2025
బాపట్ల: హత్యకు కుటుంబ వివాదాలే కారణమా..?

తెనాలి చెంచుపేటలో బాపట్ల జిల్లా వాసి జూటూరి తిరుపతిరావు (బుజ్జి) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అమృతలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన తిరుపతిరావు పెదపూడి సొసైటీ మెంబర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఐదుగురు కుమార్తెలు కాగా తెనాలిలోని ఓ కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఉదయం టిఫిన్ కోసం బయటికి వచ్చిన అతడిని ఓ వ్యక్తి నరికి చంపాడు. హత్యకు కుటుంబ వివాదాలే కారణమని సమాచారం.
News October 14, 2025
GDK: రేపు ఉదయం స్పెషల్ యాత్రా బస్సు

రేపు ఉదయం 5 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్పెషల్ యాత్రా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరనుంది. ఈ యాత్రలో భాగంగా రామప్ప, లక్నవరం, బొగత వాటర్ ఫాల్స్, మేడారం దర్శనాల అనంతరం రాత్రి వరకు బస్సు గోదావరిఖనికి చేరుకుంటుందని GDK DM నాగభూషణం తెలిపారు. ఒక్కరికి ఛార్జీ రూ.900లుగా ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని సూచించారు.