News October 14, 2025

ASF: విభేదాలు.. ఎవరికో ‘హస్తం’ పగ్గాలు

image

ASF జిల్లాలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అందజేస్తారని ఆసక్తి నెలకొంది. విశ్వప్రసాద్ రావు, శ్యామ్ నాయక్ వర్గాల మధ్యలో విభేదాలతో పార్టీ సతమతం అవుతోంది. వీరిద్దరిలో అధ్యక్ష పదవిపై పోటీ ఉంది. అలాగే విశ్వప్రసాదరావు వర్గంలోని అనిల్ గౌడ్ తదితరులు దరఖాస్తులు ఇస్తారని సమాచారం. సిర్పూర్(టి) నియోజకవర్గంలో దండే విఠల్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అధ్యక్ష బరిలో ఉంటానని ఆయన వెల్లడించలేదు. ఎవరికి పగ్గాలిస్తారో చూడాలి.

Similar News

News October 14, 2025

మంత్రి సీతక్క చొరవ.. జంపన్న వాగు వద్ద మళ్లీ బోటు

image

ఏటూరునాగారం మండలం దొడ్ల జంపన్న వాగు వద్ద రవాణా సౌకర్యం పునరుద్ధరించారు. నిన్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో, మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి వెళ్లగా ఆమె తక్షణమే స్పందించి, తాత్కాలికంగా తొలగించిన బోటును మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈరోజు బోటు ఏర్పాటు కావడంతో రవాణా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

News October 14, 2025

బాపట్ల: హత్యకు కుటుంబ వివాదాలే కారణమా..?

image

తెనాలి చెంచుపేటలో బాపట్ల జిల్లా వాసి జూటూరి తిరుపతిరావు (బుజ్జి) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అమృతలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన తిరుపతిరావు పెదపూడి సొసైటీ మెంబర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఐదుగురు కుమార్తెలు కాగా తెనాలిలోని ఓ కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఉదయం టిఫిన్ కోసం బయటికి వచ్చిన అతడిని ఓ వ్యక్తి నరికి చంపాడు. హత్యకు కుటుంబ వివాదాలే కారణమని సమాచారం.

News October 14, 2025

GDK: రేపు ఉదయం స్పెషల్ యాత్రా బస్సు

image

రేపు ఉదయం 5 గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి స్పెషల్ యాత్రా సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరనుంది. ఈ యాత్రలో భాగంగా రామప్ప, లక్నవరం, బొగత వాటర్ ఫాల్స్, మేడారం దర్శనాల అనంతరం రాత్రి వరకు బస్సు గోదావరిఖనికి చేరుకుంటుందని GDK DM నాగభూషణం తెలిపారు. ఒక్కరికి ఛార్జీ రూ.900లుగా ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని సూచించారు.