News October 14, 2025

MNCL: హస్తం పగ్గాలు అక్క చేతికేనా..?

image

జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక కీలకంగా మారింది. మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్‌తో MNCL MLA ప్రేమ్ సాగర్ రావు మధ్య వివాదం అందరికీ తెలిసిందే. మంత్రి పదవి గడ్డం కుటుంబానికి కేటాయించారు. కాబట్టి డీసీసీ అధ్యక్ష పదవి కొక్కిరాల ఫ్యామిలీకి ఇస్తారని చర్చ నడుస్తోంది. కొందరు పొటీలో ఉన్నా.. పార్టీని ఎప్పటి నుంచో నడిపిస్తున్న కొక్కిరాల సురేఖకు అప్పజెపుతారని, ఆమె వద్దంటే ఇతరులకు ఇస్తారని టాక్.

Similar News

News October 14, 2025

RGM: సీజనల్ వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు మస్ట్

image

ట్రేడ్ లైసెన్స్ లేకుండా సీజనల్ వ్యాపార విక్రయాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టపాసులు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు పొందాలన్నారు. వెబ్ సైట్ https://emunicipal.telangana.gov.in ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

News October 14, 2025

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: సివిల్ సప్లై అధికారి

image

ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఫైజల్ హుస్సేని తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మొత్తం 176 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, ధాన్యం కొనుగోలుకు కావల్సిన 46 లక్షల గన్నీ బ్యాగులకు గానూ, 30.39 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని అన్నారు.

News October 14, 2025

GDK: ఈనెల 15 వరకు డిగ్రీలో ప్రవేశాలు

image

డా.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీలోని వివిధ కోర్సులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 15 వరకు అవకాశం ఉందని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా, కో-ఆర్డినేటర్ డా.సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చన్నారు. వివరాలకు 7382929655ను సంప్రదించాలన్నారు.