News October 14, 2025

పోలీస్ శాఖను మూసేయడం బెటర్: హైకోర్టు అసంతృప్తి

image

ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్‌లో రాజీ రికార్డుల సీజ్‌కు HC SEP 19న ఆదేశాలిచ్చింది. CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.

Similar News

News February 21, 2026

లిక్కర్ స్కామ్.. A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. గతంలో ఈయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

News February 21, 2026

గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

image

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.

News February 21, 2026

‘వైఖానస ఆగమం’ అనుసరించే శ్రీవారి పూజలు

image

విఖనస మహర్షి రచించిన ‘వైఖానస ఆగమం’ శ్రీవారి ఆలయ పూజా విధానాలకు మూలస్తంభం. ఇది దేవాలయ, గృహ పూజా శాస్త్రాన్ని సమగ్రంగా వివరిస్తుంది. ఈ ఆగమం ప్రకారం తిరుమలలో పూజలు జరుగుతాయి. వీటివల్ల లోకకళ్యాణం, సస్యశ్యామలం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. TTD శతాబ్దాలుగా ఈ ఆగమ సూత్రాలను పాటిస్తూ శ్రీవారి కైంకర్యాలు నిర్వహిస్తోంది. భక్తులను ఆర్జిత సేవల్లో భాగస్వాములను చేస్తూ ఇందులోని నియమాలు కొనసాగిస్తున్నారు.