News October 14, 2025

ఏలూరు: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

image

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి తన ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్‌-1లో ఉంటున్న సాయిలక్ష్మి(27) తన రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు చేతన్‌ కార్తికేయ, లాస్యత వల్లి‌ని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. సాయిలక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు.

Similar News

News October 14, 2025

ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

image

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.

News October 14, 2025

మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

image

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.

News October 14, 2025

తార్నాక మౌలిక ఆత్మహత్య కేసులో అంబాజి అరెస్ట్

image

HYD తార్నాకలోని కాలేజీ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అంబాజీ నాయక్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట్రైన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అంబాజీ నాయక్ పాత ఫోన్‌లో మౌలికను వేధిస్తూ చేసిన మెసేజ్‌ల డేటా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.