News October 14, 2025

విశాఖ: ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

image

ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కూర్మన్నపాలేనికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మెసెజ్ చేశారు. వివిధ కంపెనీల పేరిట రూ.15.51 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. టెలిగ్రామ్ గ్రూపు IP లాగ్స్ ద్వారా నంద్యాలకి చెందిన షేక్ షరీఫ్ రెహమాన్, అబ్ధుల్ రెహమాన్, హుస్సేన్ వలిని పట్టుకున్నారు.

Similar News

News October 14, 2025

విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్‌ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

News October 14, 2025

సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

image

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహాల కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.

News October 14, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 120 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 120 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.