News October 14, 2025

హనుమకొండ: కార్పొరేటర్ ఇంట్లో పేకాట.. 12 మంది అరెస్ట్

image

హనుమకొండ సుబేదారి కనకదుర్గ కాలనీలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలతో సహా 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 వేల నగదు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 14, 2025

HYD: ‘ప్రపంచ స్కిల్ కాంపిటేషన్.. రేపే లాస్ట్’

image

ప్రపంచ స్కిల్ కాంపిటేషన్ (World Skill Competition)లో పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈనెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. వయస్సు 16-24 ఏళ్లలోపు ఉండి నైపుణ్యం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 14, 2025

నాకు 20 ఏళ్లు వచ్చేవరకు వ్యవసాయం చేశా: కలెక్టర్

image

తనకు 20 ఏళ్లు వచ్చేవరకు వ్యవసాయం చేసినట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సిద్దిపేట జిల్లా తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహరం అందరికి అవసరం వ్యవసాయ పరిశోధనల ప్రపంచ జనాభాకు సరిపడా ఆహరం అందిస్తున్నయాన్నారు. ఈ మేరకు కృషి చేస్తున్న విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

News October 14, 2025

RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

image

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.