News October 14, 2025

HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

image

HYD జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్‌రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.

Similar News

News October 14, 2025

అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

image

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్‌ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.

News October 14, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సినీ ప్రముఖులతో రహస్య చర్చలు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, BRS, BJPకి పెద్ద సవాలు. ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు రాజకీయ నాయకులు కొందరు సినీ నటులతో రహస్య సమావేశాలు నిర్వహించి, తమకు మద్దతుగా ప్రచారం చేయమని ఆహ్వానించడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, జూ.NTR,రామ్ చరణ్ వంటి అనేక మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఇక్కడి ఓటర్లు. ప్రచారం చివరి వారంలో కొందరు సెలబ్రెటీలు ప్రచారంలో పాల్గొంటారు.

News October 14, 2025

HYD: చనిపోయిన మహిళ వివరాలు గుర్తింపు

image

HYD మీర్‌పేట్ చందన (మంత్రాల) చెరువులో <<18001273>>మహిళ మృతదేహాన్ని<<>> బడంగ్‌పేట్ మమతానగర్ కాలనీకి చెందిన యాదమ్మ అలియాస్ కమల (50)గా పోలీసులు గుర్తించారు. 3 రోజుల క్రితం ఆమె మిస్సింగ్ కేసు నమోదైనట్లు సమాచారం. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైడ్రా బృందం సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు మీర్‌పేట్ పోలీసులు తెలిపారు.