News October 14, 2025
చిత్తూరు జిల్లాలో TDPని చుట్టుముడుతున్న వివాదాలు

చారిత్రాత్మక విజయం అనంతరం జిల్లాలో TDP బలోపేతం అవుతుందని అందరూ భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంబేడ్కర్ విగ్రహ దహనం, నకిలీ లిక్కర్ స్కామ్, మహిళలపై లైంగిక వేధింపులతోపాటూ వారి వ్యక్తిగత వీడియోలు తీసిపెట్టాలనే ఆరోపణలు జిల్లాలోని కూటమి MLAల మెడకు చుట్టుకుంటున్నాయి. శుభమా అని అన్ని సీట్లు గెలిచిన TDPలో ఏడాదిన్నరలోపే వివాదాలు రేగడం అధిష్ఠానం వైఫల్యమే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News October 14, 2025
గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఒంగోలు పాత ZPHS సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులతో భౌతిక సమీక్షా సమావేశాన్ని డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, హాజరై పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు.
News October 14, 2025
రైల్వే స్టేషన్‌లో చిన్నారిని విడిచిన గుర్తుతెలియని వ్యక్తులు

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారిని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై ఓ వ్యక్తికి పాపని చూడమని, టాయిలెట్‌కి వెళ్లి వస్తామని ఓ మహిళ అప్పగించి వెళ్లిపోయారు. తిరిగి ఆ వ్యక్తి రాకపోవడంతో GRP పోలీసుల సహకారంతో పలాస రైల్వే స్టేషన్‌లో చైల్డ్ హెల్ప్ డెస్క్‌కు చిన్నారిని అప్పగించారు.
News October 14, 2025
HYD: ‘మటన్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్’

మటన్ వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్టూట్(చెంగిచర్ల) లెక్కల ప్రకారం దేశంలో మటన్ అత్యధికంగా ఆరగించే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని HYD ఫుడ్ సంస్థ లుక్మి పేర్కొంది. సాధారణంగా మాంసం వినియోగం ప్రకారం ఓ వ్యక్తి ఏడాదికి 7 కేజీల మటన్ ఆరగించే అవకాశం ఉందని.. కానీ తెలంగాణలో నాలుగు రెట్లు అధికంగా 24 కేజీల మటన్ తింటున్నట్లు సంస్థ వెల్లడించింది.