News October 14, 2025

SBIలో 63 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

SBIలో 63 మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ లేదా MBA/ PGDBA/ PGDBM/ CA/ ICWA/CFA, B.E/B.Tech/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు ₹750, SC, ST, PwBD ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

Similar News

News October 14, 2025

బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. కాగా 243 స్థానాల్లో 101 సీట్ల చొప్పున పోటీ చేయాలని ఇప్పటికే BJP, JDU నిర్ణయించుకున్నాయి. మిగిలిన సీట్లను ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాయి.

News October 14, 2025

విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

image

APలోని విశాఖలో గూగుల్ AI హబ్‌ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2025

అఫ్గాన్‌, పాక్‌ మధ్య మళ్లీ హోరాహోరీ పోరు

image

పాక్, అఫ్గానిస్థాన్‌ మధ్య మళ్లీ హోరాహోరీ ఘర్షణ తలెత్తింది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్‌ తమ పౌరులను టార్గెట్‌ చేసుకొని కాల్పులు జరుపుతోందని అఫ్గాన్‌ ఆరోపించింది. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని వివరించింది. తమ సైన్యం కూడా దీటుగా బదులిస్తోందని పేర్కొంది. కాగా ఇటీవల జరిగిన కాల్పుల్లో 58 మంది పాక్‌ సైనికులు మరణించినట్లు అఫ్గాన్‌ ప్రకటించడం తెలిసిందే.