News October 14, 2025
నేడే పైడిమాంబ తెప్పోత్సవం.. ఏర్పాట్లు పూర్తి..!

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం నేడు జరగనుంది. ఈ సందర్భంగా పెద్ద చెరువు వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా వనం గుడి వద్ద వేద సభ ఉంటుందని, సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కానుందని ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News October 14, 2025
KNR: కష్టపడిన వారికే పార్టీలో సముచిత స్థానం

పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందని ఏఐసీసీ పరిశీలకుడు, హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే స్పష్టం చేశారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఏఐసీసీ ఆదేశాల ప్రకారం, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.
News October 14, 2025
చిన్న పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులతో రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాప్‌పై కూడా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
News October 14, 2025
WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్‌నెస్‌తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.