News October 14, 2025
పాడేరు: హోమ్ స్టేల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలి

హోమ్ స్టేల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక స్థలాలను గుర్తించి, హోమ్ స్టేలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి జాయింట్ కలెక్టర్‌కు అందించాలన్నారు. వాష్ రూమ్స్, పార్కింగ్ స్థలాలు, ఫుడ్ కోర్టు, యాత్రికులు బస చేసేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు.
Similar News
News October 14, 2025
వరంగల్: ఈనెల 18 వరకు పలు రైళ్లు రద్ద

నేటి నుంచి ఈనెల 18 వరకు WGL, KZP మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శాతవాహన, ఇంటర్‌సిటీ, KZP-DRKL పుష్‌పుల్ రైళ్లు రద్దు చేశామన్నారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకే నడుస్తుందని, కోణార్క్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. డోర్నకల్-పాపట్‌పల్లి మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 14, 2025
జిల్లా టీడీపీ అధ్యక్ష రేసులో మెట్ల రమణబాబు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు పేరు వినిపిస్తోంది. రమణబాబు దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడిగా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అమలాపురం ఎమ్మెల్యే విజయానికి కీలకంగా పనిచేశారు. ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఎంపీ సానా సతీశ్ అధిష్టానంతో చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
News October 14, 2025
పాలమూరు యూనివర్శిటీ.. స్నాతకోత్సవాల UPDATE

పాలమూరు వర్శిటీలో మొట్ట మొదటి స్నాతకోత్సవం NOV 20న, 2014లో జరిగింది. 56 బంగారు పతకాలు, 7636 డిగ్రీలు(UG & PG) ప్రదానం చేశారు.
✒2వ స్నాతకోత్సవం మార్చి 6న, 2019లో జరిగింది. మొత్తం 14,675 డిగ్రీలు(UG&PG), 115 బంగారు పతకాలు ప్రదానం చేశారు.
✒3వ స్నాతకోత్సవం NOV 24న, 2022లో జరిగింది. మొత్తం 6 PhD. (కెమిస్ట్రీ-3, ఇంగ్లీష్-2, మైక్రోబయాలజీ-1), 33,577 డిగ్రీలు (UG & PG), 71 బంగారు పతకాలు ప్రదానం చేశారు.