News October 14, 2025
బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

HYD బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలు, పట్టు చీరతో అలంకరించి, పంచ హారతులు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Similar News
News October 14, 2025
NGKL: ‘పోలీస్ అమరవీరుల’ దినోత్సవం.. వ్యాసరచన పోటీలు

అక్టోబరు 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు.
News October 14, 2025
వరంగల్ నిట్‌లో ఆయారే టెక్నోజియాన్

వరంగల్ నిట్‌లో సాంకేతిక సంబరం టెక్నీజియాన్-2025 ప్రారంభం కానుంది. ఈనెల 24, 25వ తేదీల్లో నిట్‌లో టెక్నోజియాన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.2,00,000 విలువైన బహుమతి నిధితో పాటు, రెండు రోజులపాటు ఉత్సాహభరితమైన పోటీలు, సాంకేతిక ప్రదర్శనలు, విభిన్న ఈవెంట్‌లతో నిండి ఉండే ఈ ఉత్సవం, సాంకేతిక పురోగతిని వేడుకగా జరుపుకునే వేదికగా నిలవనుంది.
News October 14, 2025
పాడి పరిశ్రమ అభివృద్ధికి కార్యాచరణ: కలెక్టర్

పాడి పరిశ్రమ అభివృద్ధికి పోషక విలువలున్న ‘ప్రోటీన్ టోటల్ మిక్స్‌డ్ రేషన్’ను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక, సహకార శాఖల అధికారులతో నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. పాల దిగుబడిని పెంచే దిశగా మిక్స్‌డ్ దాణా సరఫరాకు కార్యాచరణ చేపట్టాలన్నారు.