News October 14, 2025
సంగారెడ్డి: NMMSకు నేడే చివరి తేదీ

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.
Similar News
News October 14, 2025
డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్‌లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్‌లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్‌ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.
News October 14, 2025
నారాయణపేట: ఇందిరమ్మ ఇండ్ల పనులపై కలెక్టర్ సమీక్ష

నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పనుల్లో ఆలస్యం జరుగుతున్నందుకు ఆమె అసహనం వ్యక్తం చేశారు. గ్రేడింగ్ పూర్తయిన ఇండ్లను వెంటనే ప్రారంభించి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అని ఆమె అన్నారు.
News October 14, 2025
తాజా రౌండప్

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం