News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
Similar News
News January 31, 2026
సారవకోటలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

సారవకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫించన్లను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శనివారం పంపిణీ చేశారు. ప్రతి సచివాలయం సిబ్బంది లబ్ధిదారుని ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని సూచించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీఓ మోహన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
News January 31, 2026
టెక్కలి: భర్తకు తలకొరివి పెట్టిన భార్య

టెక్కలి ఆధి ఆంధ్రావీధికి చెందిన జోగి మల్లేసు బ్రెయిన్ స్ట్రోక్‌తో శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మల్లేసు, సీతమ్మ దంపతులు స్థానికంగా తాళ్లు, కట్టెలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా కుమారుడు గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ మేరకు భార్య సీతమ్మ భర్త చితికి తలకొరివి పెట్టిన ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
News January 31, 2026
శ్రీకాకుళం: దిగొచ్చిన కోడిగుడ్డు

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల మొదటి వారంలో కొండెక్కిన కోడి గుడ్ల ధర ఎట్టకేలకు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. న్యూ ఇయర్ సీజన్ ప్రారంభంలో గరిష్ఠంగా ఒక్కో గుడ్డు రూ.10 రికార్డ్ ధరకు చేరింది. డిమాండ్‌కి తగ్గ సప్లై లేకపోవటం, గుడ్ల ఉత్పత్తి తగ్గటం దీనికి కారణం. ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి, సరఫరా మెరుగుపడటంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ. 5.50 – రూ.6 ఉందని వ్యాపారులు తెలిపారు.


