News April 8, 2024

KMM: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ముత్యాలగూడెంకు చెందిన చిన్నబాబు(58) ఎండ తీవ్రతకు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అదే విధంగా ఇల్లెందు అడ్డరోడ్డు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రహదారి పక్కనే వడదెబ్బకు గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 30, 2024

ఆపరేషన్ చేసి గడ్డను తొలగించిన ఎమ్మెల్యే

image

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శస్త్ర చికిత్స చేశారు. ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరంకి చెందిన కుంజ రత్తమ్మ(51) తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ చేసి గడ్డ ఉందని వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు.

News September 30, 2024

పాలడుగు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

image

వైరా మండలం పాలడుగు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం చావా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ సోమవారం వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్ వేటు పడింది. హెడ్మాస్టర్ శ్రీనివాసరావుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News September 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పాత పత్తి ధర రూ.7,600 జెండా పాట పలికింది. అలాగే, క్వింటా కొత్త పత్తి ధర రూ.7,011 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర,కొత్త పత్తి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.