News October 14, 2025
కాజులూరులో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల్లో జిల్లాలో 224.8 mm వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాజులూరు మండలంలో 78.4, అత్యల్పంగా శంఖవరంలో 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచార శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సగటున వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది.
Similar News
News October 14, 2025
ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు: మంత్రి

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కర్నూలులో సమీక్ష, పర్యవేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
News October 14, 2025
స్వదేశీ యాప్స్‌పై పెరుగుతున్న మోజు!

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో తర్వాత స్వదేశీ మ్యాప్స్ యాప్ ‘MapmyIndia’ ఇన్‌స్టాల్స్ భారీగా పెరిగాయి. 1995లో భారతీయ జంట రాకేశ్, రష్మీ వర్మ రూపొందించిన ఈ యాప్, Google Maps కంటే ముందే సేవలు అందిస్తోంది. ఇందులో ఉండే 3D జంక్షన్ వ్యూ ద్వారా సంక్లిష్ట జంక్షన్లలో దారి సులభమవుతుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై హెచ్చరికలు, లైవ్ సిగ్నల్ కౌంట్‌డౌన్ వంటి ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
News October 14, 2025
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ: MHBD SP

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వ్యాసరచన పోటీని ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నట్లు ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మత్తు పదార్థాల సమస్య నిరోధించడంలో పోలీసు పాత్ర, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధానంపై వ్యాసరచన ఉంటుందన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eAలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.