News October 14, 2025

WGL: రూ.30 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. ఈరోజు (మంగళవారం) రూ.30 పెరిగి, రూ. 6,960 అయిందని వ్యాపారస్తులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో తేడాలు ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

MBNR: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం.. UPDATE!

image

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒ ఫొటోగ్రఫీ
అంశం: పోలీస్ సేవలు, త్యాగాలు/ప్రజా రక్షణ
ఫొటోలు: గరిష్ఠంగా 3
ఫొటో సైజు: 10×8 ఇంచులు
✒ షార్ట్ ఫిలిం
వ్యవధి: గరిష్ఠంగా 3Mits
థీమ్: పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత/సమాజ రక్షణ.. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మీ పూర్తి వివరాలతో పాటు ఫొటోలు, షార్ట్ ఫిలిం(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలి.

News October 14, 2025

ADB: అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి

image

అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగవంతం చేసి బాధితులకు అండగా నిలవాలని, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న
దౌర్జన్యాల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేకూర్చాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సభ్యుల అభిప్రాయాలు స్వీకరించారు.

News October 14, 2025

సిద్దిపేట: భూభారతి ధరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో భూ భారతి పెండింగ్ అప్లికేషన్ డిస్పోజల్ ప్రక్రియ గూర్చి జిల్లా కలెక్టర్ K.హైమావతి జూమ్ సమీక్ష నిర్వహించారు. RDO, తహశీల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో మిస్సింగ్ సర్వ్ నంబర్, పెండింగ్ మ్యుటేషన్, సక్సేషన్, DS, ఫీల్డ్ ఎంక్వైరీ, POB, సాదా బైనామా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు.