News October 14, 2025

వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కి మంగళవారం మిర్చి బస్తాలు తరలివచ్చాయి. కాగా సోమవారంతో పోలిస్తే తేజ మిర్చి ధర పెరగగా మిగతా మిర్చి ధరలు తగ్గాయి. 341 రకం మిర్చి క్వింటాకు సోమవారం రూ.16,300 ధర పలకగా..ఈరోజు రూ.16,150 అయింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.16వేలు ధర వస్తే.. నేడు రూ.15,500 ధర వచ్చింది. తేజ మిర్చికి సోమవారం ధర రూ.14,300 ధర పలకగా.. మంగళవారం రూ.14, 550 కి పెరిగింది.

Similar News

News October 14, 2025

టీటీఐ భవనాన్ని పరిశీలించిన కామారెడ్డి ఎస్పీ

image

కామారెడ్డి SP రాజేష్ చంద్ర మంగళవారం NH-44 పక్కన ఉన్న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ భవనాన్ని సందర్శించారు. ఈ భవనాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మైనర్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడానికి ఉపయోగించనున్నట్లు SP తెలిపారు. సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

News October 14, 2025

నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు: సురేఖ

image

TG: తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘మేడారం జాతర పనుల బాధ్యతను మంత్రి పొంగులేటికి కూడా CM అప్పజెప్పారు. టెండర్ల ఖరారు పారదర్శకంగా జరిగి పనులు త్వరగా కావాలన్నదే నా ఉద్దేశం. మా మధ్య విభేదాలు లేవు. అయితే కొందరు ప్రతీది వివాదం చేయాలని చూస్తున్నారు’ అని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. హీరో <<17283242>>నాగార్జున <<>>కుటుంబ వ్యవహారంలోనూ వివాదం సృష్టించారన్నారు.

News October 14, 2025

చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు చర్యలు

image

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయదారులకు సహకరించని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలను నిలుపుదల చేయాలని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు.