News October 14, 2025

భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

image

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

Similar News

News October 14, 2025

రైడెన్‌తో వచ్చే ఉద్యోగాలెన్నో చెప్పాలి : YCP

image

AP: విశాఖలో గూగుల్ రైడెన్ సంస్థ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వం చెప్పాలని YCP డిమాండ్ చేసింది. ‘ఆ సంస్థకు 500 ఎకరాలు, ₹22వేల కోట్ల రాయితీలిస్తున్నారు. రోజుకు 24 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. కనీసం 20వేల ఉద్యోగాలైనా రావాలి. కానీ డేటా సెంటర్‌తో అన్ని జాబ్‌లు రావు. డెవలప్మెంటు సెంటర్‌తో ఐటీ పార్కును అభివృద్ధి చేయాలి’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.

News October 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 35 సమాధానాలు

image

1. రామాయణంలో రాముడు, సుగ్రీవులు కిష్కింధ కాండంలో కలుస్తారు.
2. పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు చేశారు.
3. విష్ణువు మూడో అవతారం ‘వరాహ’.
4. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ‘కృత్తికా’ నక్షత్రంతో కలిసి ఉంటాడు.
5. అరటి పండును సంస్కృతంలో కదళీ ఫలమని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 14, 2025

నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు: సురేఖ

image

TG: తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘మేడారం జాతర పనుల బాధ్యతను మంత్రి పొంగులేటికి కూడా CM అప్పజెప్పారు. టెండర్ల ఖరారు పారదర్శకంగా జరిగి పనులు త్వరగా కావాలన్నదే నా ఉద్దేశం. మా మధ్య విభేదాలు లేవు. అయితే కొందరు ప్రతీది వివాదం చేయాలని చూస్తున్నారు’ అని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. హీరో <<17283242>>నాగార్జున <<>>కుటుంబ వ్యవహారంలోనూ వివాదం సృష్టించారన్నారు.