News October 14, 2025

HYD: తెలుగు వర్శిటీ.. ఫిలిం డైరెక్షన్ దరఖాస్తులకు ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీ నాంపల్లి ప్రాంగణంలో “పీజీ డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్” కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణతలైన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వర్శిటీ రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.రాజు 9346461733కు సంప్రదించాలన్నారు.

Similar News

News October 14, 2025

తిరుమలలో 30న శ్రీవారి ఆలయంలో పుష్ప యాగం

image

శ్రీవారి ఆలయంలో 30న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. ముందురోజు 29న రాత్రి 8 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లకు సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కాగా తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

News October 14, 2025

NRPT: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం

image

అక్టోబరు 21న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, వ్యాసరచన పోటీలలో ఔత్సాహికులు పాల్గొనాలని ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో కోరారు. పోలీస్ విధుల్లో ప్రతిభను తెలిపే పోటోలు, వీడియోలను జిల్లా పోలీస్ కార్యాలయంలోని పీఆర్వో వెంకట్‌కు అందించాలని సూచించారు. వివరాలకు 87126 70380 నంబరును సంప్రదించవచ్చు.

News October 14, 2025

కోటనందూరు: ఉద్యోగాల పేరుతో మోసం

image

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల వద్ద లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కోటనందూరు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. బొద్దవరం గ్రామానికి చెందిన మళ్లా మల్లేశ్వరరావు, మరొకరు కలిసి విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి రూ.25 లక్షలకు పైగా వసూలు చేశారన్నారు. వారికి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసగించారని ఎస్ఐ వివరించారు.