News October 14, 2025
వరంగల్: వాట్ అన్ ఐడియా సర్ జీ..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ఇంటి స్థలం అమ్మకానికి యజమాని ఎంచుకున్న పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 108 గజాల స్థలం, ఇంటిని కేవలం రూ.500 కూపన్‌తో లక్కీ డ్రా ద్వారా గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించాడు. 3 వేల కూపన్లు ముద్రించామని వచ్చే ఏడాది జనవరి 15న గుంజేడు ముసలమ్మ దేవస్థానం వద్ద డ్రా తీయనున్నట్లు చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఫీజులను విజేత భరించాలని పేర్కొన్నాడు.
Similar News
News October 14, 2025
సిరిసిల్ల: ‘వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలి’

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా లావాదేవీలు జరగని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ మేరకు సిరిసిల్లలో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కేవైసీ చేయించుకుని మళ్ళీ వారి అకౌంటుని ఆక్టివేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. 10 సంవత్సరాలకు పైగా క్లైమ్ చేయని డిపాజిట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ కి బదిలీ చేయబడ్డాయన్నారు.
News October 14, 2025
మర్కూక్: మాగంటి సునితకు బీఫాం అందజేసిన కేసీఅర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్కు ఇచ్చారు. దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులు హాజరయ్యారు.
News October 14, 2025
గిరిజన ఉత్పత్తులకు అధిక లాభాలు రావాలి: కలెక్టర్

జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ స్థాపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులను మరింత పెంచాలన్నారు. వాటి నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకింగ్, మార్కెట్ సౌకర్యం కల్పించి అధిక లాభాలు వచ్చేలా చేయాలన్నారు.


