News October 14, 2025

గోదావరిఖని: ‘రుణాలు మంజూరు చేసి సహకరించాలి’

image

స్వశక్తి సంఘాలకు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని రామగుండం ఇన్‌ఛార్జి కమిషనర్‌ జే.అరుణశ్రీ అన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం టీఎల్‌బీసీ సమావేశం జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను మొదటి, 2వ, 3వ విడతలు సకాలంలో మంజూరు చేయాలని ఆమె కోరారు.

Similar News

News October 14, 2025

బాధించేవే మెదడులో భారంగా ఉండిపోతాయి..!

image

ప్రేమతో పలకరించిన మాటల కంటే, బాధించిన విమర్శలనే మనిషి మెదడు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. దీనికి ‘సర్వైవల్ క్యూ మెకానిజం’ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలు మెదడులో బలమైన నాడీ ప్రతిస్పందనలను యాక్టివేట్ చేయడం వల్ల 2 దశాబ్దాలు దాటినా గుర్తుంచుకుంటామని తెలిపారు. ప్రశంసలు సురక్షిత సంకేతాలు కాబట్టి అవి నెల రోజుల్లోనే మసకబారిపోతాయని వెల్లడించారు. మీకూ ఇలానే జరిగిందా?

News October 14, 2025

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, PGR గార్డెన్స్‌ను సీపీ పరిశీలించి సూచనలు చేశారు.

News October 14, 2025

సిద్దిపేట: డైలీ వేస్ కాంటినెంట్ వర్కర్ల నిరసన

image

సిద్దిపేట కలెక్టరేట్లో డైలీ వేజ్, కాంటినింజెంట్ వర్కర్లు మంగళవారం నిరసన చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వారు సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. టైం స్కేల్, పాత జీతాల చెల్లింపు, మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 33వ రోజు నిరసనలో జిల్లా నాయకులు గంగా శ్రీను, కిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.