News October 14, 2025

జగిత్యాల: ఉ.9 దాటినా కానరాని సూరీడు..!

image

జగిత్యాల జిల్లాలో ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు అయినా సూర్యుడు కనిపించలేదు. అయితే తెల్లవారుజామున చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లులు కూడా కురిశాయి. ఈరోజు కూడా అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు పడుతున్నాయి.

Similar News

News October 14, 2025

రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ

image

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, PGR గార్డెన్స్‌ను సీపీ పరిశీలించి సూచనలు చేశారు.

News October 14, 2025

సిద్దిపేట: డైలీ వేస్ కాంటినెంట్ వర్కర్ల నిరసన

image

సిద్దిపేట కలెక్టరేట్లో డైలీ వేజ్, కాంటినింజెంట్ వర్కర్లు మంగళవారం నిరసన చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వారు సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. టైం స్కేల్, పాత జీతాల చెల్లింపు, మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 33వ రోజు నిరసనలో జిల్లా నాయకులు గంగా శ్రీను, కిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

News October 14, 2025

RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.