News October 14, 2025
మంత్రి సీతక్క చొరవ.. జంపన్న వాగు వద్ద మళ్లీ బోటు

ఏటూరునాగారం మండలం దొడ్ల జంపన్న వాగు వద్ద రవాణా సౌకర్యం పునరుద్ధరించారు. నిన్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగడంతో, మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి వెళ్లగా ఆమె తక్షణమే స్పందించి, తాత్కాలికంగా తొలగించిన బోటును మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈరోజు బోటు ఏర్పాటు కావడంతో రవాణా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Similar News
News October 14, 2025
రేపు వరంగల్‌కు సీఎం.. ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించగా.. బుధవారం ఆమె పెద్దకర్మను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అవుతున్న ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, PGR గార్డెన్స్‌ను సీపీ పరిశీలించి సూచనలు చేశారు.
News October 14, 2025
సిద్దిపేట: డైలీ వేస్ కాంటినెంట్ వర్కర్ల నిరసన

సిద్దిపేట కలెక్టరేట్లో డైలీ వేజ్, కాంటినింజెంట్ వర్కర్లు మంగళవారం నిరసన చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వారు సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. టైం స్కేల్, పాత జీతాల చెల్లింపు, మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 33వ రోజు నిరసనలో జిల్లా నాయకులు గంగా శ్రీను, కిషన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
News October 14, 2025
RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.