News October 14, 2025
ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: సివిల్ సప్లై అధికారి

ములుగు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం చేసినట్లు జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఫైజల్ హుస్సేని తెలిపారు. జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మొత్తం 176 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా, ధాన్యం కొనుగోలుకు కావల్సిన 46 లక్షల గన్నీ బ్యాగులకు గానూ, 30.39 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని అన్నారు.
Similar News
News October 14, 2025
తెనాలి హత్య కేసులో నిందితుడి గుర్తింపు.. ప్రత్యేక బృందాలతో గాలింపు

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.
News October 14, 2025
VZM: ‘జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి బి.మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 557 కేసులు నమోదు చేసి, రూ.34.12 లక్షల జరిమానా, రూ.24.12 లక్షల రాజీ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
News October 14, 2025
సంగారెడ్డి: కారు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షలు చోరీ

కారు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షలు చోరీ చేసిన ఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముజాఫర్ ఇల్లు అమ్మి డబ్బుతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. ఓ దాబా వద్ద కారు ఆపగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షల ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.