News October 14, 2025

RGM: సీజనల్ వ్యాపారాలకు ట్రేడ్ లైసెన్సులు మస్ట్

image

ట్రేడ్ లైసెన్స్ లేకుండా సీజనల్ వ్యాపార విక్రయాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టపాసులు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక ట్రేడ్ లైసెన్సు పొందాలన్నారు. వెబ్ సైట్ https://emunicipal.telangana.gov.in ద్వారా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

Similar News

News October 14, 2025

తెనాలి హత్య కేసులో నిందితుడి గుర్తింపు.. ప్రత్యేక బృందాలతో గాలింపు

image

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.

News October 14, 2025

VZM: ‘జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

image

శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి బి.మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 557 కేసులు నమోదు చేసి, రూ.34.12 లక్షల జరిమానా, రూ.24.12 లక్షల రాజీ రుసుం వసూలు చేసినట్లు చెప్పారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

News October 14, 2025

సంగారెడ్డి: కారు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షలు చోరీ

image

కారు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షలు చోరీ చేసిన ఘటన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముజాఫర్ ఇల్లు అమ్మి డబ్బుతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. ఓ దాబా వద్ద కారు ఆపగా బైక్‌పై వచ్చిన ఇద్దరు అద్దాలు పగలగొట్టి రూ.20 లక్షల ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.