News October 14, 2025

మంథని: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి స్టేజీ సమీపంలో బొక్కల వాగు కట్ట కింద SSB ఇటుకల బట్టి సంపులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిది మంథని మండలం స్వర్ణపెళ్లి గ్రామం. అతడిని ఉప్పు మహేష్‌గా గుర్తించారు. మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతుడు గత ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ మెకానిక్‌గా మంథనిలో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

Similar News

News October 14, 2025

దీపావళి.. శునకాలకు ప్రత్యేక పూజలు చేస్తారు!

image

నేపాల్‌లో దీపావళి సందర్భంగా ఐదు రోజుల తిహర్ జరుపుకుంటారు. ఇందులో భాగంగా రెండో రోజు శునకాలను పూజిస్తుంటారు. మానవుల పట్ల శునకాలు చూపించే విశ్వసనీయతకు కృతజ్ఞతలు చెప్పడానికి దీనిని పాటిస్తారు. వీధి, పెంపుడు కుక్కలనే తేడా లేకుండా అన్ని శునకాలకూ పూలమాలలు వేసి నుదిటిపై తిలకం దిద్దుతారు. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించి గౌరవిస్తారు. ఈ సంస్కృతి నేపాలీ ప్రజల జంతు ప్రేమను చాటుతుంది.

News October 14, 2025

నిర్మల్: జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి

image

మంగళవారం సాయంత్రం అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మిల్లులలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు సహా అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వే బ్రిడ్జీలకు నిర్ణీత గడువులోపు స్టాంపింగ్ చేయించుకోవాలని సూచించారు. రైతులు పంటలు అమ్మిన వెంటనే నిర్ణీత గడువులోపు వారికి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 14, 2025

వాస్తుతో సంతోషకర జీవితం

image

ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండేవారందరూ సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తద్వారా మంచి నిద్ర, విశ్రాంతి లభిస్తాయి. సామాజిక బంధాలను మెరుగుపరిచే ఆలోచనలు తెస్తాయి. అవి అవకాశాలను మోసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాయి. దీంతో ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన జీవితానికి వాస్తు మూల కారణం’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>