News October 14, 2025
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు

అంపరేషన్ చేయూత ద్వారా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 81,141CRPF బెటాలియన్ అధికారుల ఆధ్వర్యంలో లొంగిపోయారని తెలిపారు. ఇప్పటివరకు 326 మంది లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన పాపారావు, బండి కోస, పద్దం లక్మా, మడివి లక్మ, దొడ్డి బద్రులకు ఎస్పీ తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేశారు.
Similar News
News October 14, 2025
సిద్దిపేట: స్వగ్రామానికి చేరిన మావోయిస్టు వెంకటయ్య

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన మావోయిస్టు కొంకకటి వెంకటయ్య అలియాస్ వికాస్ కొన్ని రోజుల క్రితం DGP శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఆయన మంగళవారం స్వగ్రామమైన కూటిగల్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆయన పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.
News October 14, 2025
GWL: తెలంగాణ రైజింగ్ విజన్‌లో ఉద్యోగులు పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణని అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్- 2047’ డాక్యుమెంట్ రూపకల్పనలో ఉద్యోగులు పాల్గొనాలని గద్వాల కలెక్టర్ సంతోష్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు ఈ సర్వే అక్టోబర్ 10న ప్రారంభమైందని తెలిపారు. ఉద్యోగులు, పౌరులు పాల్గొని విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News October 14, 2025
ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>