News October 14, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్

image

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్‌షిప్‌ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్‌షిప్ అందిస్తోంది. ఇంటర్‌లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్‌సైట్: <>https://ruparahulbajajscholarship.bajajauto.co.in/<<>>

Similar News

News October 14, 2025

ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా?

image

చేతిలో ధనం నిలవనివారు 21 రోజుల సంకల్పాన్ని పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు. ‘రోజూ ఉదయం లక్ష్మీదేవిని ప్రార్థించి, కొంత డబ్బును హుండీలో వేయండి. అనవసర ఖర్చులు చేయకూడదనే నియమం పెట్టుకోండి. సాయంత్రం వచ్చాక, ఖర్చు చేయకుండా ఆపగలిగిన డబ్బును అందులో వేయండి. ఈ ఆచరణ 21 రోజులు పాటిస్తే దైవ కృపతో ఆర్థిక సుస్థిరత సాధిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#DHARMASANDEHALU<<>>

News October 14, 2025

₹212 కోట్లతో అమరావతిలో రాజ్‌భవన్

image

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్‌భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్‌లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్‌కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.

News October 14, 2025

కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

image

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.