News October 14, 2025

చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలి: కలెక్టర్

image

జిల్లాలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ మహేశ్ కుమార్‌ చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని 23 చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. సంఘాలకు రావలసిన బకాయిల చెల్లింపులపై కూడా దిశానిర్దేశం చేశారు.

Similar News

News October 15, 2025

2800 MW విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి

image

AP: రాష్ట్రంలో 2800 MW విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం GOలు జారీచేసింది. మన్యం(D) మక్కువ(M) దుగ్గేరులో 2000MW హైడ్రో ప్రాజెక్టు కోసం ‘చింతా గ్రీన్ ఎనర్జీ’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం(D) కమలపాడు, కొనకొండ్ల, గుల్లపాలెంలో ‘ACME ఊర్జా’, బెళుగుప్ప(M)లోని 4 గ్రామాల్లో ‘TATA’ 400MW చొప్పున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఓకే చెప్పింది. వీటికి భూమి ఇతర రాయితీలను GOల్లో పొందుపర్చారు.

News October 15, 2025

రామాయంపేట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొలిపర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ(40) కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News October 15, 2025

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

image

పాలకొల్లు-దిగమర్రు రహదారిపై బైకును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో మంగళవారం ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు. క్షతగాత్రులు శరణ్ శర్మ, సాయి చరణ్‌ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు పేరుపాలెం వెళ్తున్నట్లు సమాచారం. యువకులు తణుకుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కొల్లి మహేష్ రాజు(18) మృతి చెందాడు.