News April 8, 2024
తూ.గో.: WARNING.. నేడు వడగాల్పులు

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాజమండ్రిలో 45.0 ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే 2వ అత్యధికం. కాగా కాకినాడ జిల్లాలోని 6, కోనసీమ- 4, తూ.గో. జిల్లాలోని 15 మండలాల్లో వడగాల్పులకు ఆస్కారం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. – మీ వద్ద ఎలా ఉంది..?
Similar News
News October 4, 2025
తూ. గో: 11,915 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్త్రీ శక్తి పథకం అనంతరం నష్ట పోతున్నామని భావించిన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తూ.గో జిల్లాలో 11,915 మందికి రూ.17.87 కోట్లు మేర లబ్ధి చేకూరనుంది. నేడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ కానుంది.
News October 4, 2025
రాజమండ్రి : అక్టోబర్ 15 ‘NMMS’ పరీక్ష దరఖాస్తుకు తుది గడువు

డిసెంబర్ 7న జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు డీఈవో కె. వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 తుది గడువుగా పేర్కొన్నారు. పరీక్ష రుసుం చెల్లింపునకు 16వ తేదీ, సంబంధిత పత్రాలతో 18వ తేదీలోగా డీఈఓ కార్యాలయానికి సమర్పించాలన్నారు.
News October 4, 2025
బాణాసంచా గోడౌన్లను తనిఖీ చేసిన జేసీ మేఘ స్వరూప్

దీపావళి బాణాసంచా తయారీ, అమ్మకాలకు సంబంధించి కచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలని జేసీ మేఘ స్వరూప్ స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో కలిసి ఇటీవల దరఖాస్తు చేసుకున్న బాణాసంచా గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. గోదాముల వద్ద భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. భద్రత ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మెరికమ్మ, ఇతర అధికారుల ఆయన వెంట ఉన్నారు.