News October 14, 2025

వీరఘట్టం: కట్లు విప్పుతుండగా వ్యాన్ డ్రైవర్ మృతి

image

ప్రమాదవశాత్తు వీరఘట్టం మెయిన్ రోడ్‌లో ఓ వ్యాన్ డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. విజయవాడ నుంచి గోనె సంచుల లోడ్‌తో వీరఘట్టం వచ్చిన డ్రైవర్ కట్లు విప్పుతుండగా ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి- క్యాబిన్‌కు మధ్యలో జారిపడి ఇరుక్కుపోయాడు. స్థానికులు ఆయన్ను బయటికి తీసుకు వచ్చినప్పటికీ క్షణాల్లోనే మృతి చెందాడు. మృతుడు యాకుబ్‌గా గుర్తించారు. ఎస్ఐ జి.కళాధర్ కేసు నమోదు చేశారు.

Similar News

News October 15, 2025

బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

image

దీపావళి సందర్భంగా బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. తాత్కాలిక షాపులు పట్టణ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 15, 2025

ములుగు: సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీతక్క

image

ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రామప్ప సరసు నుంచి లక్నవరం నీటి సరఫరాకు, పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందేలా చూడాలన్నారు.

News October 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.