News October 14, 2025

పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ: MHBD SP

image

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వ్యాసరచన పోటీని ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నట్లు ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మత్తు పదార్థాల సమస్య నిరోధించడంలో పోలీసు పాత్ర, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధానంపై వ్యాసరచన ఉంటుందన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eAలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News October 15, 2025

భీమ్‌గల్: మూడేళ్ల చిన్నారి మృతి (UPDATE)

image

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాలు.. రహత్ నగర్‌కు చెందిన శిరీష తన పెద్ద కుమారున్ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకు శ్రీకాంత్(3) బస్సు ముందుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బాలున్ని బస్సుతో ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.

News October 15, 2025

సంగారెడ్డి: ఉద్యోగులు సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రైసింగ్- 2047లో ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. https://www.telangana.gov.in/telanganarising/ లింకు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చని చెప్పారు. ఉద్యోగులతో పాటు పౌరులు కూడా ఈ సర్వేలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

News October 15, 2025

అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్(ఫొటోలో) జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1986: హీరో సాయి దుర్గా తేజ్ జననం
1986: బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
*ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
*గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే