News October 14, 2025

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు: మంత్రి

image

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కర్నూలులో సమీక్ష, పర్యవేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Similar News

News October 15, 2025

‘మీ ప్రతి పైసా సురక్షితం’

image

ప్రతీ వ్యక్తికి జీవిత బీమా అందించాల్సిన బాధ్యత LICపై ఉందని, అది ప్రతీ LIC ఏజెంట్ బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాలని కడప డివిజన్ సీనియర్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మిగనూరు LIC బ్రాంచ్ కార్యాలయంలో ఏజెంట్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. LICలో పెట్టే ప్రతి పైసా సురక్షితమైనదన్నారు.

News October 14, 2025

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కర్నూలుకు బంగారు పతకాలు

image

ఈనెల 10 నుంచి 14 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్-20 విభాగంలో కర్నూలుకు చెందిన అథ్లెట్ మొగిలి వెంకట్రామిరెడ్డి ఏపీ తరఫున పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. 800, 1500 మీటర్ల పరుగు పోటీల్లో ఈ ఘనత సాధించిన వెంకట్రామిరెడ్డిని అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడా ప్రతినిధులు హర్షవర్ధన్ మంగళవారం ఓ ప్రకటనలో అభినందించారు.

News October 14, 2025

కర్నూలుకు మోదీ.. పాఠశాలలకు సెలవు

image

ప్రధాని నరేంద్ర <<18001308>>మోదీ<<>> ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనుండటంతో 15, 16 తేదీల్లో నాలుగు మండలాల పరిధిలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూల్ అర్బన్, రూరల్, కల్లూరు, ఓర్వకల్ మండలాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. FA-2 పరీక్షలు 21, 22వ తేదీలలో నిర్వహించాలని ఆదేశించారు.