News October 14, 2025

వనపర్తి: రేపు మెడికల్ ఆఫీసర్ల తాత్కాలిక మెరిట్ లిస్టు విడుదల

image

మెడికల్ ఆఫీసర్ల తాత్కాలిక మెరిట్ లిస్టును బుధవారం నుంచి 17వ తేదీ వరకు www.wanaparthy.telangana.nic.in వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ.శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకొని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

Similar News

News October 15, 2025

భద్రాద్రి: ఈనెల 16న చుంచుపల్లి లో జాబ్ మేళా.!

image

భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ బుధవారం తెలిపారు. చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మెరీనా పెయింట్స్ కంపెనీలో 27 విభాగాలలో 2190 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. 24 ఏళ్ల నుంచి 43 ఏళ్ల వారు, 10, ANY డిగ్రీ, ITI, B.Tech, ANM, GNM అర్హత కలిగిన వారు పాల్గొనాలని సూచించారు.

News October 15, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.252.87 కోట్లు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూ.252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపులు రూ.2233.21 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

News October 15, 2025

భీమ్‌గల్: మూడేళ్ల చిన్నారి మృతి (UPDATE)

image

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాలు.. రహత్ నగర్‌కు చెందిన శిరీష తన పెద్ద కుమారున్ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకు శ్రీకాంత్(3) బస్సు ముందుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బాలున్ని బస్సుతో ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.