News October 14, 2025

పెద్దపల్లిలో డీసీసీ అధ్యక్ష అభిప్రాయ సేకరణ

image

PDPL డీసీసీ అధ్యక్ష నియామకంపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం మంగళవారం PDPLలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, RMG MLA MS రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ పరిశీలకులు డా. జయకుమార్, కేతురి వెంకటేష్, ఖాజా ఫక్రుద్దిన్, TPCC జనరల్ సెక్రటరీ రాజేష్ కాశీపాక హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు, మహిళా, యువజన, NSUI కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.

Similar News

News October 15, 2025

కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

image

మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంటాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందనీ అనుమానం వ్యక్తంచేశారు. కాగా, DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025 చివరివరకు పొడిగించగా తాజాగా<<18008160>> వేటుపడింది<<>>.

News October 15, 2025

భద్రాద్రి: ఈనెల 16న చుంచుపల్లి లో జాబ్ మేళా.!

image

భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ బుధవారం తెలిపారు. చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మెరీనా పెయింట్స్ కంపెనీలో 27 విభాగాలలో 2190 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. 24 ఏళ్ల నుంచి 43 ఏళ్ల వారు, 10, ANY డిగ్రీ, ITI, B.Tech, ANM, GNM అర్హత కలిగిన వారు పాల్గొనాలని సూచించారు.

News October 15, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.252.87 కోట్లు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూ.252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపులు రూ.2233.21 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.