News October 14, 2025
NRPT: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం

అక్టోబరు 21న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, వ్యాసరచన పోటీలలో ఔత్సాహికులు పాల్గొనాలని ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో కోరారు. పోలీస్ విధుల్లో ప్రతిభను తెలిపే పోటోలు, వీడియోలను జిల్లా పోలీస్ కార్యాలయంలోని పీఆర్వో వెంకట్‌కు అందించాలని సూచించారు. వివరాలకు 87126 70380 నంబరును సంప్రదించవచ్చు.
Similar News
News October 15, 2025
కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంటాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందనీ అనుమానం వ్యక్తంచేశారు. కాగా, DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025 చివరివరకు పొడిగించగా తాజాగా<<18008160>> వేటుపడింది<<>>.
News October 15, 2025
భద్రాద్రి: ఈనెల 16న చుంచుపల్లి లో జాబ్ మేళా.!

భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ బుధవారం తెలిపారు. చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మెరీనా పెయింట్స్ కంపెనీలో 27 విభాగాలలో 2190 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. 24 ఏళ్ల నుంచి 43 ఏళ్ల వారు, 10, ANY డిగ్రీ, ITI, B.Tech, ANM, GNM అర్హత కలిగిన వారు పాల్గొనాలని సూచించారు.
News October 15, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.252.87 కోట్లు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ వారం రూ.252.87 కోట్ల నిధులు విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు. 22,305 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. పథకం ప్రారంభం నుంచి ఒక వారంలో ఇంత మొత్తాన్ని జమ చేయడం మొదటిసారని తెలిపారు. దీంతో తొలి 6 నెలల్లో మొత్తం చెల్లింపులు రూ.2233.21 కోట్లకు చేరాయన్నారు. ప్రస్తుతం సుమారు 2.18 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.