News October 14, 2025
RMG: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు: కమిషనర్లు

సింగరేణి రామగుండం-3 ఏరియాలో సీఎంపీఎఫ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, డా.కె. గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ సేవలు ఇప్పుడు పూర్తిగా C-CARES పోర్టల్ ద్వారా పారదర్శకంగా అందుతున్నాయని తెలిపారు. 355 రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లను GM నరేంద్ర సుధాకరరావుకు అందజేశారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా జీరో పెండింగ్ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
GDP గ్రోత్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(IMF) 2025కు గాను ఇండియా GDP గ్రోత్‌ను రివైజ్ చేసింది. ఈ ఏడాదికి 6.4% గ్రోత్ ఉంటుందని పేర్కొన్న IMF దానిని 6.6%కు పెంచింది. 2026లో అది 6.2% ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికం. గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది 3.2% కాగా, వచ్చే ఏడాది 3.1%కు తగ్గొచ్చంది. US గ్రోత్ ఈ ఏడాది 2.0% ఉండగా 2026లో 2.1%కు పెరగొచ్చని తెలిపింది.
News October 15, 2025
కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంటాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందనీ అనుమానం వ్యక్తంచేశారు. కాగా, DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025 చివరివరకు పొడిగించగా తాజాగా<<18008160>> వేటుపడింది<<>>.
News October 15, 2025
భద్రాద్రి: ఈనెల 16న చుంచుపల్లి లో జాబ్ మేళా.!

భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ బుధవారం తెలిపారు. చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మెరీనా పెయింట్స్ కంపెనీలో 27 విభాగాలలో 2190 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. 24 ఏళ్ల నుంచి 43 ఏళ్ల వారు, 10, ANY డిగ్రీ, ITI, B.Tech, ANM, GNM అర్హత కలిగిన వారు పాల్గొనాలని సూచించారు.