News October 14, 2025
IRCTCలో 45 పోస్టులు

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com/
Similar News
News February 21, 2026
పోలీసులతో కలిసి పనిచేస్తారా? ఇది మీకోసమే!

TG: హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న 25ఏళ్లలోపు విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్, ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఎంపికైన వారు ఆధునిక పోలీసింగ్, డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పోలీసులకు సహకరిస్తారు. యువతలోని నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ వారికి పాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. HYD పోలీస్ <
News February 21, 2026
నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులను ఏరివేస్తాం: అమిత్ షా

అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచి కూడా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ మాదిరిగానే చొరబాటుదారులనూ మరో ఐదేళ్లలో ఏరివేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని కామ్‌రూప్‌లో ఆయన మాట్లాడారు. ‘అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని రాహుల్ చెప్పారు. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే వారే ఆ పార్టీకి ఓటు బ్యాంక్. INC విధానాలు అస్సాంకు ముప్పుగా మారాయి’ అని ఆరోపించారు.
News February 21, 2026
ట్రంప్ టారిఫ్‌ల రద్దు.. భారత్ రియాక్షన్ ఇదే

ట్రంప్ విధించిన టారిఫ్‌లను US సుప్రీంకోర్టు రద్దు చేయగా ట్రంప్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తొలిసారి భారత వాణిజ్య శాఖ రియాక్టైంది. US SC ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని చెప్పింది. ఆపై ట్రంప్ వ్యాఖ్యలు, ఆ దేశ యంత్రాంగం ప్రకటించిన కొన్ని చర్యల వల్ల భవిష్యత్తులో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.


