News October 14, 2025

హైదరాబాద్‌లో భారీగా ఇంజీనీర్లు బదిలీ

image

నీటిపారుదల శాఖలో భారీగా ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 106 మంది అధికారులను బదిలీ చేస్తూ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్క హైదరాబాద్ సర్కిల్‌లో 60 మందికి పైగా బదిలీ అయ్యారు. ఒక్కసారి 106 మంది అధికారులు బదిలీ కావడంతో ఇరిగేషన్ శాఖలో చర్చకు దారి తీసింది. చాలా ఏళ్లుగా అధికారులు ఒకే స్థానంలో ఉండటంతో ప్రభుత్వం ప్రస్తుతం బదిలీ చేసినట్లు సమాచారం.

Similar News

News October 15, 2025

HYD: సనత్‌నగర్‌లో గన్, తల్వార్‌ సీజ్

image

హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో గన్‌తో హల్‌చల్ చేస్తున్న చంద్రకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ గన్, తల్వార్‌తో కొంతకాలంగా కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు అతడి నుంచి గన్, తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

News October 15, 2025

హైదరాబాద్‌: లోన్ ఆఫర్ కాల్స్‌తో జాగ్రత్త

image

హైదరాబాద్‌లో ఫేక్ ఎన్‌జీఓ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బేగంపేట‌కు చెందిన ఓ వ్యక్తి(30) రూ. 7.9 లక్షలు మోసపోయాడు. హెచ్‌వైసీ ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి.. రూ.50 లక్షల లోన్ ఇస్తానని నమ్మించి, పలు ఫీజుల పేరుతో రూ. 7.9 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత లోన్ ఆఫర్లను నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

News October 15, 2025

ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.